వడగళ్ల వానతో దెబ్బతిన్న ఫ్లైట్ ముందుబాగం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

by Disha Web Desk 12 |
వడగళ్ల వానతో దెబ్బతిన్న ఫ్లైట్ ముందుబాగం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రాన్ని అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. అందులోను వడగళ్లు కురుస్తుండటంతో ఇప్పటికే పలు ప్రమాదాలు చోటు చేసుకోగా..తాజాగా ఇండిగో విమానానికి ముప్పు తప్పింది. అహ్మాదాబాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రంలో ల్యాండ్ అవుతున్న సమయంలో వడగళ్ల వాన కారణంగా 6E6594 ఇండిగో విమానం ముందు భాగం దెబ్బతినింది. గాలిలో ఉండగానే వడగళ్ల వర్షానికి విమానం ముందు భాగం, విండ్‌షీల్డ్‌లు దెబ్బతినడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం సేఫ్‌‌గా లాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వడగళ్ళ వానకు ముందు భాగం దెబ్బతినిందని, అయినా పైలెట్ చాకచక్యంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రన్‌వే 27L వద్ద సేఫ్‌గా ల్యాండ్ చేయగలిగారని ప్రయాణికులు మెచ్చుకుంటున్నారు. ఈ ఘటనలో సిబ్బందికి, ప్రయాణికులు ఎటువంటి గాయాలు కాలేదు.



Next Story

Most Viewed