కరోనా ముందు ప్రపంచం ఓడిన భారత్ విజయం: ప్రధాని మోడీ

by Disha Web Desk 19 |
కరోనా ముందు ప్రపంచం ఓడిన భారత్ విజయం: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహ్మమారి ముందు ప్రపంచం మొత్తం ఓడినప్పటికీ భారత్ మాత్రం గెలిచిందని ప్రధాన మోడీ అన్నారు. భారత్‌ కరోనాను జయించడంలో రాష్ట్రాల పాత్ర కూడా ఉందని ప్రశసించారు. కరోనా మహ్మమారి విజృంభణ సమయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 20 సార్లు సమావేశమయ్యాయని మోడీ గుర్తు చేశారు. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం ప్రధాని మోడీ రాజ్య సభలో మాట్లాడారు. దేశం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి.. రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతోందని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధికి కావాల్సిన నిధులు ఇస్తున్నామని.. ఫెడరలిజానికి ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుందని తెలిపారు. భారతదేశ గొప్పతనం ఢిల్లీలో కాదని.. దేశంలోనా మారుమూల ప్రాంతాల్లో ఉందన్నారు. ఇండియా అంటే ఒక్క ఢిల్లీని కాదని.. హైదరాబాద్, బెంగళూర్, ముంబై అంతా ఇండియానేని అన్నారు. అందుకే జీ20 సమావేశాలను దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహించామని చెప్పారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదం కాదని.. ఇది మోడీ గ్యారెంటీ అని పేర్కొన్నారు.

Next Story

Most Viewed