సరిహద్దుల్లో ముగ్గురు ఉగ్రవాదుల పట్టివేత

by Dishafeatures2 |
సరిహద్దుల్లో ముగ్గురు ఉగ్రవాదుల పట్టివేత
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పూంచ్ ఎల్వోసీ నుంచి మన దేశంలోకి చొరబడటానికి యత్నించిన ఉగ్రవాదుల కుట్రను భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలోనే ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఆర్మీకి చెందిన ఓ జవాన్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. కొందరు ఉగ్రవాదులు కూడా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుఝామున భారత ఆర్మీ జవాన్లు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు పూంచ్ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో భారీగా కురుస్తున్న వర్షాన్ని అవకాశంగా చేసుకొని కొందరు ఉగ్రవాదులు సరిహద్దులు దాటి మన దేశంలోకి చొరబడే ప్రయత్నం చేశారు.

ఇది గమనించిన ఆర్మీ జవాన్లు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు వారిని హెచ్చరిస్తూ కాల్పులు జరిపారు. దాంతో ఉగ్రవాదులు కూడా కాల్పులు జరిపారు. అరగంట తర్వాత కాల్పులు ఆగిపోగా జవాన్లు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ జరుపగా ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వారి నుంచి మారణాయుధాలు, ఐఈడీ బాంబును స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో రక్తపు మరకలను బట్టి కాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు కూడా గాయపడినట్టు తెలుస్తోందని అధికారులు చెప్పారు. వీరి కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నట్టు తెలిపారు.



Next Story

Most Viewed