LCA Tejas : ఎయిర్ ఫోర్స్‌కు తొలి ‘తేజస్’ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌

by Disha Web Desk 13 |
LCA Tejas : ఎయిర్ ఫోర్స్‌కు తొలి ‘తేజస్’ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌
X

బెంగళూరు : సైనిక శిక్షణ అవసరాలకు వినియోగించే రెండు సీట్లతో కూడిన మొట్టమొదటి తేలికపాటి తేజస్ యుద్ధ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్), భారత వాయుసేనకు అందించింది. బుధవారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరితో కలిసి ఈ విమానం నమూనాను అందుకున్నారు. సాధారణ పైలట్‌లను ఫైటర్ పైలట్‌లుగా మార్చడానికి అవసరమైన శిక్షణను ఈ విమానాలతో అందించనున్నారు.

ఇలాంటి మరో 18 తేజస్ ఫైటర్ జెట్స్ కావాలని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. 2023-24లో మరో 8 తేజస్‌లను ‘హాల్’ డెలివరీ చేయనుందని సమాచారం. మిగిలిన పదింటిని 2026-27 నాటికి సప్లై చేయనుంది. మనదేశంలో సాధారణ రకం తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ తొలిసారిగా 2001లో అందుబాటులోకి వచ్చింది. నాటి నుంచి అది ఎన్నో మైలు రాళ్లను దాటుకుంటూ ఈ స్థాయికి ఎదిగింది.



Next Story