మా జోలికోస్తే వదలిపెట్టం: రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికలు

by Disha Web Desk 21 |
మా జోలికోస్తే వదలిపెట్టం: రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికలు
X

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక హెచ్చరికలు చేశారు. తాము ఎవరి జోలికి వెళ్లమని, ఒకవేళ తమ జోలికి వస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పు లఢఖ్‌లో పరిస్థితులపై ఆదివారం ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా నిర్వహిస్తున్నామని, అన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి ఉద్ఘాటించారు. 'భారత్ శాంతి ప్రేమిక దేశం. ఏ దేశానికి ఇబ్బంది కలిగించేలా ప్రయత్నించదు. కానీ, ఎవరైనా దేశంలో శాంతి, సామర్యసతను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే తగిన గుణపాఠం చెప్తాం' అని అన్నారు.

సాయుధ బలగాలకు స్వదేశీ అత్యాధునిక ఆయుధాలను సిద్ధం చేసి భద్రతా యంత్రాంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ప్రతి భారతీయ సైనికుడిలో కనిపించే జాతీయ గర్వం, దేశభక్తి లక్షణాలు, మతపరమైన అడ్డంకులను అధిగమించడం ద్వారా పౌరులు దేశ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. సైనికుడికి కుటుంబమే అతిపెద్ద శక్తి, సహాకార వ్యవస్థ అని, ప్రభుత్వం దానిని బలోపేతం చేసేందుకు ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టదని పేర్కొన్నారు.


Next Story

Most Viewed