'దౌత్యవేత్తలను తగ్గించుకోండి'.. కెనడాకు భారత్ అల్టిమేటం

by Disha Web Desk 13 |
దౌత్యవేత్తలను తగ్గించుకోండి.. కెనడాకు భారత్ అల్టిమేటం
X

న్యూఢిల్లీ: కెనడాలో ఖలిస్తానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారత్ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో చీలికలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 10 నాటికి 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాకు భారత్ అల్టిమేటం జారీ చేసినట్లు ది ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక తెలిపింది. అక్టోబర్ 10 తర్వాత వారు ఇక్కడే ఉంటే, దౌత్యపరమైన పవర్స్ తొలగిస్తామని భారత్ హెచ్చరించింనట్లు తెలుస్తోంది. కెనడాకు భారతదేశంలో 62 మంది దౌత్యవేత్తలు ఉండగా.. వారి హైకమిషన్‌లో ఆ సంఖ్యను 41కి తగ్గించాలని వెల్లడించినట్లు నివేదిక పేర్కొంది.

అయితే ‘ఎక్కువ మంది కెనడియన్ దౌత్యవేత్తలను అంగీకరించబోమని ప్రకటించడం ప్రస్తుత పరిస్థితికి సాయపడదు. ఈ అసమ్మతితో ముడిపడిన భావోద్వేగాలను తగ్గించడాన్ని మరింత కష్టతరం చేస్తుంది’ అని కెనడియన్ సెనేట్ కమిటీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చైర్ పీటర్ బోహ్మ్ చెప్పినట్లు సదరు వార్తాపత్రిక పేర్కొంది. భారత్ కెనడాను ‘తేలిక’గా భావించిందని తెలిపిన బోహ్మ్.. ఒట్టావాకు మైనారిటీ ప్రభుత్వం ఉన్నందున ప్రతీకారం తీర్చుకోవడంలో పరిమిత సామర్థ్యం గురించి న్యూఢిల్లీకి తెలుసునని ఆయన నొక్కి చెప్పారు.



Next Story

Most Viewed