అగ్రరాజ్యంపై భారత్ ఆగ్రహం.. ఎందుకంటే..

by Disha Web Desk 17 |
అగ్రరాజ్యంపై భారత్ ఆగ్రహం.. ఎందుకంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో గత ఏడాది మణిపూర్‌లో హింస చేలరేగిన విషయం తెలిసిందే. అయితే దీని ఆధారంగా భారత్‌లో చాలా మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని అమెరికా ఒక నివేదికను విడుదల చేసింది. దీనిపై తాజాగా భారత్ తీవ్రంగా స్పందించింది. గురువారం విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన నివేదిక ఏకపక్షంగా ఉందని, దీనికి ఎలాంటి విలువ ఇవ్వడం లేదని అన్నారు. భారత్‌పై ఏమాత్రం అవగాహన లేకుండానే ఈ నివేదికను విడుదల చేశారని ఆయన అన్నారు.

ఇటీవల విడుదలైన 2023 కంట్రీ రిపోర్ట్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ ప్రాక్టీసెస్, ఇండియాలో మణిపూర్‌లో మెయిటీ, కుకీ తెగల మధ్య జరిగిన జాతి వివాదం "ముఖ్యమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు" దారితీసిందని ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ ఘటనలో చట్టవిరుద్ధమైన హత్యలు, మనుషుల అదృశ్యాలు, ఏకపక్షంగా అరెస్టు చేయడం లేదా నిర్బంధం, బలవంతంగా నేరాన్ని ఒప్పుకోవడం కోసం హింసించడం, ఇంటర్నెట్ బంద్ చేయడం, టెలికమ్యూనికేషన్లను నిరోధించడం, పౌర సమాజ కార్యకర్తలు, జర్నలిస్టులపై నిఘా, మానవ హక్కుల పరిరక్షకుల బెదిరింపు, నేరాలకు కుటుంబ సభ్యులను శిక్షించడం, హింస లేదా బెదిరింపులతో కూడిన నేరాలు వంటి మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఈ రిపోర్ట్‌‌పై భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది.



Next Story

Most Viewed