ఒక రాష్ట్రం.. ఒక యూటీ.. ఇండియా కూటమి సీట్ల పంపకాలు ఖరారు

by Dishanational4 |
ఒక రాష్ట్రం.. ఒక యూటీ.. ఇండియా కూటమి సీట్ల పంపకాలు ఖరారు
X

దిశ, నేషనల్ బ్యూరో : వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం తమిళనాడు, పుదుచ్చేరిలలో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు శనివారం ఖరారైంది. సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం.. తమిళనాడులో తొమ్మిది, పుదుచ్చేరిలో ఒక స్థానంలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. డీఎంకే 21 స్థానాల్లో, సీపీఐ, సీపీఎం, వీసీఏ పార్టీలు రెండు స్థానాల్లో, ఎండీఎంకే, ఐయూఎంఎల్, కేఎన్‌ఎంకే పార్టీలు ఒక్కో స్థానంలో బరిలోకి దిగుతాయి. ఈ పొత్తుల్లో భాగంగానే 2025 సంవత్సరంలో కమల్‌హాసన్‌కు చెందిన ఎంఎన్‌ఎంకు ఒక రాజ్యసభ సీటును కేటాయించారు. ఈవివరాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ధ్రువీకరించారు. తాము పోటీచేయని చోట్లలో డీఎంకే, కూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులను బలపరుస్తామని ఆయన వెల్లడించారు. తమిళ నాడులోని మొత్తం 40 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని వేణుగోపాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, డీఎంకేల బంధం చెక్కుచెదరలేదన్నారు.



Next Story

Most Viewed