ఢిల్లీ ప్రజల నిర్లక్ష్యం.. దీపావళి తర్వాత మరింత ఇబ్బందికర పరిస్థితి!

by Disha Web Desk 2 |
ఢిల్లీ ప్రజల నిర్లక్ష్యం.. దీపావళి తర్వాత మరింత ఇబ్బందికర పరిస్థితి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న దీపావళి సందర్భంగా వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. బాణసంచాపై నిషేధం ఉన్నప్పటికీ నగరంలో జోరుగా దీపావళి సంబురాలు చేసుకున్నారు. సుప్రీంకోర్టు నిషేధాన్ని కూడా పక్కనపెట్టి ఢిల్లీ వాసులు టపాసుల మోత మోగించారు. దీంతో సోమవారం ఉదయం రాజధాని, దాని పరిసర ప్రాంతాలను కాలుష్య పొగ కమ్మేసింది. చాలాచోట్ల అర్ధరాత్రి వరకు టపాసుల మోత మోగింది. దీంతో సోమవారం ఉదయానికి ఢిల్లీలో గాలి నాణ్యత మళ్లీ క్షీణించింది. పలు ప్రాంతాల్లో విషపూరిత పొగమంచు కమ్మేయడంతో వాహనదారులకు మళ్లీ ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.



Next Story

Most Viewed