Budget 2024 : నిర్మలమ్మ బడ్జెట్ స్పీచ్ లో ఈసారి ఆ ఆనవాయితీకి బ్రేక్

by Disha Web Desk 13 |
Budget 2024 : నిర్మలమ్మ బడ్జెట్ స్పీచ్ లో ఈసారి ఆ ఆనవాయితీకి బ్రేక్
X

దిశ, డైనమిక్ బ్యూరో:సార్వత్రిక ఎన్నికల వేళ దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ తాత్కాలిక బడ్జెట్ 2024 ను ప్రవేశపెట్టారు. వరుసగా ఆరోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పగా ఈసారి ఆమె స్పీచ్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈసారి ఫైనాన్స్ మినిస్టర్ తన బడ్జెట్ స్పీచ్ లో ఎలాంటి కవితలు, కొటేషన్లు, స్పూర్తివంతమైన వ్యాఖ్యలు ప్రస్తావించలేదు. గతంలో ప్రతి బడ్జెట్ సమావేశంలోనూ నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో సందర్భానుసారంగా పలువురు ప్రముఖుల వ్యాఖ్యలను ప్రస్తావించే వారు. కానీ ఈసారి మాత్రం అంటువంటి వ్యాఖ్యలేమి ప్రస్తావించకుండా బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. దీంతో సీతారామన్ తన ఆనవాయితీని తానే బ్రేక్ చేశారెందుకనే టాక్ వినిపిస్తోంది. కాగా ఎన్నికలకు ముందు బడ్జెట్ కావడంతో తాము ఏం చేయబోతున్నామో అనే విషయాల కంటే గడిచిన 10 ఏళ్లుగా తమ ప్రభుత్వం హయాంలో చేపట్టిన పనుల పైనే ఆర్థిక మంత్రి తన స్పీచ్ లో ప్రాముఖ్యతను ఇచ్చారు.

ఇది ప్రజల బడ్జెట్ అని గత పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భుత ప్రగతి సాధిస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తోందని తమ హయాంలో దేశ ఆర్థిక స్థితి ఉన్నత స్థాయికి చేరుకుందన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని ప్రకటించారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని గతంలో సామాజిక న్యాయం కేవలం రాజకీయ నినాదంగా మాత్రమే ఉండేదని కానీ తాము అధికారంలోకి వచ్చాక దానిని అమలు చేసి చూపుతున్నామని చెప్పారు. గడిచిన పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామన్నారు.


Next Story

Most Viewed