హిజాబ్ ధరించకపోతే.. అక్కడ పదేళ్లు జైలుకే !

by Disha Web Desk 1 |
హిజాబ్ ధరించకపోతే.. అక్కడ పదేళ్లు జైలుకే !
X

దిశ, వెబ్ డెస్క్ : మహిళలను లింగ వివక్షకు గురిచేయడం క్రూరమైన చర్య అని ఐక్యరాజ్య సమితి ఇటీవలే వెల్లడించింది. అయితే ఈ క్రమంలోనే ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించని మహిళలకు, ఇందుకు మద్దతు తెలిపే వారికి భారీ శిక్షలు విధించేలా ఇరాన్ పార్లమెంట్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. దీంతో బాధ్యులు గరిష్టంగా పదేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంటుంది. హిజాబ్ ధరించని మహిళలకు సాయం చేసే వారు, అందుకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించే వారందరూ కొత్త చట్టం ప్రకారం శిక్షించబడతారు. గత సెప్టెంబర్ లో ఇరాన్ పార్లమెంట్‌లో సమీక్ష నిర్వహించినప్పుడు యునైటెడ్ నెషన్ బృందం ఈ కొత్త చట్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Next Story

Most Viewed