నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఊహించలేదు: యూపీఎస్సీ టాపర్ శ్రీవాస్తవ

by Disha Web Desk 12 |
నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఊహించలేదు: యూపీఎస్సీ టాపర్ శ్రీవాస్తవ
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం విడుదలైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొత్తం 1016 మంది అర్హత సాధించినట్లు యూపీఎస్సీ బోర్డు ప్రకటించింది. కాగా ఆదిత్య శ్రీవాస్తవ ఈ పలితాల్లో మొదటి ర్యాంక్ తో యూపీఎస్సీ టాపర్ గా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పొజిషన్ సాధించడం కొంచెం కష్టమైన పని.. కానీ నాకు యూపీఎస్సీ మొదటి ర్యాంక్ వస్తుందని ఊహించలేదు. ఈ సమయంలో నేను నా దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పుకొచ్చారు. అలాగే నాకు టాప్ 70 ర్యాంక్ వస్తే.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లోకి ప్రవేశించగలను. ఆ ఉద్దేశ్యం తోనే ముందుకు సాగాను. ఈ క్రమంలో ఊహించని పలితాన్ని సాధించాను.

మీరు సాధించాలనుకున్న దానిపై స్థిరంగా, కష్టపడి పనిచేయడంతోపాటు స్మార్ట్ వర్క్‌తో చేయడం ద్వారా సాధ్యం అవుతుందని ఆదిత్య శ్రీవాస్తవ చెప్పుకొచ్చారు. కాగా ఈ పలితాల్లో మొదటి ర్యాంక్ ఆదిత్య శ్రీవాస్తవ, అనిమేష్ ప్రధాన్ కు రెండవ ర్యాంకు, తెలంగాణకు చెందని అనన్య రెడ్డి మూడో ర్యాంక్ సాధించారు. అలాగే 30 మంది తెలుగు ప్రాంతాలకు చెందిన వారు అర్హత సాధించారు. ఈ ఫలితాల్లో జనరల్ కేటగిరి 347, ఈడబ్యూఎస్ కేటగిరీలో 115 మంది, ఓబీసీలో 303, ఎస్సీ కేటగిరి 165, ఎస్టీ కేటగిరిలో 86 మంది ఎంపిక అయ్యారు.


Next Story

Most Viewed