'సర్జరీ చేసే సమయంలోనూ హిజాబ్‌కు అనుమతించండి'.. కేరళ ముస్లిం మెడికోల డిమాండ్

by Disha Web Desk 13 |
సర్జరీ చేసే సమయంలోనూ హిజాబ్‌కు అనుమతించండి.. కేరళ ముస్లిం మెడికోల డిమాండ్
X

తిరువనంతపురం: సర్జరీలు చేసేటప్పుడు కూడా హిజాబ్ ధరించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఏడుగురు ముస్లిం ఎంబీబీఎస్ విద్యార్థినులు కేరళలోని తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు లేఖ రాశారు. సర్జరీ రూమ్స్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను పాటించే క్రమంలో.. తమ మతాచారమైన హిజాబ్ నిబంధనను ఫాలో కాలేకపోతున్నామని తెలిపారు. విదేశాల్లో యూనిఫామ్ హెల్త్ వర్కర్స్ తరహాలో ప్రత్యామ్నాయ దుస్తులను ధరించేందుకు తమను అనుమతించాలని డిమాండ్ చేశారు.

విదేశాల్లో లాంగ్ స్లీవ్ స్క్రబ్ జాకెట్లు, సర్జికల్ హుడ్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వీటిని వినియోగించేందుకు అనుమతిస్తే.. తాము హిజాబ్ ధరించడానికి, స్టెరైల్ ప్రికాషన్స్ తీసుకోవడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. విద్యార్థినుల డిమాండ్‌పై చర్చించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లైనెట్ మోరిస్ వెల్లడించారు. దీన్ని ఇప్పటికిప్పుడు ఆమోదించడం సాధ్యం కాదని, తాను ఒక్కడినే ఈ అంశంపై నిర్ణయం తీసుకోలేనని స్పష్టం చేశారు. తాము ఏర్పాటు చేసిన కమిటీ 10 రోజుల్లోగా ఓ పరిష్కారాన్ని సూచిస్తుందన్నారు.

Next Story

Most Viewed