బుర్ఖా ధరిస్తేనే బస్సు ఎక్కాలి.. లేకపోతే నో ఎంట్రీ? (వీడియో)

by Disha Web Desk 2 |
బుర్ఖా ధరిస్తేనే బస్సు ఎక్కాలి.. లేకపోతే నో ఎంట్రీ? (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: గతంలో కర్ణాటకలో హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. గతేడాది ఉడుపి జిల్లాలో హిజాబ్ ధరించి అమ్మాయిలు కాలేజీలకు రాకూడదని తెలుపడంతో.. ఈ వివాదం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఒక సంవత్సరం వరకు ఈ హిజాబ్ వివాదం కర్టాటకను కుదిపేసింది. తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. తాజాగా కర్ణాకటకలో ఈలాంటి సంఘటననే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలోని కలబుర్గిలో ముస్లిం విద్యార్థులు బుర్ఖా ధరిస్తే తప్ప తమ బస్సు ఎక్కనివ్వరని ఒక ముస్లిం విద్యార్థి ఆరోపిస్తుంది. బుర్ఖా ధరించనందుకు తనను బస్సు ఎక్కేందుకు అనుమతించడం లేదని ఆ విద్యార్థిని తెలిపింది.

ఆమెకు అండగా ఉన్న హిందూ అమ్మాయిలు.. అవును నిజమే తనని బస్సు ఎక్కనివ్వడం లేదని చెబుతున్నారు. ఆ విద్యార్థి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కర్ణాటక ప్రభుత్వానికి, కర్ణాటక ఆర్టీసీకి ఫిర్యాదు చేస్తున్నారు. మరో వైపు ఇది బస్ డ్రైవర్ ఆ ముస్లిం విద్యార్థితో ప్రాంక్ చేశాడని పలువురు నెటిజన్లు చెబుతున్నారు. రద్దీ సమయాల్లో కండక్టర్లు సాధారణంగా పరిమిత సంఖ్యలో విద్యార్థులను అనుమతిస్తారని, టిక్కెట్టు పొందిన ప్రయాణీకులకు చోటు కల్పించేందుకు ఇతర బస్సుల్లో ఎక్కమని ఇతరులకు చెబుతుంటారని, ఈ క్రమంలోనే విద్యార్థినికి కండక్టర్ ఆ విధంగా చెప్పాడని నెటిజన్లు చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం, కర్ణాటక ఆర్టీసీ మాత్రం ఇంకా స్పందించలేదు.

Next Story

Most Viewed