Heavy Rain fall : భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ రాష్ట్రాలకు IMD హెచ్చరిక

by Disha Web Desk 12 |
Heavy Rain fall : భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ రాష్ట్రాలకు IMD హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: వర్షాకాలం ప్రారంభం కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తొలకరి జల్లులు పడుతున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు, మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD సూచిస్తుంది. ముఖ్యంగా రాబోయే మూడు రోజుల్లో.. ఒడిశా, జార్ఖండ్, గంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లలో భారీ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.

అలాగే ఉత్తరాఖండ్‌లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ యూపీ, తూర్పు యూపీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్‌లకు కూడా హెచ్చరిక జారీ చేయబడింది. కాగా అస్సాం రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల ప్రభావం తో అస్సాం రాష్ట్రంలో రవాణా వ్యవస్థ తీవ్రంగా తగ్గిపోయింది.

Next Story

Most Viewed