హనుమంతుడి గురించి విదేశాంగ మంత్రి జైశంకర్ ఏమన్నారో తెలుసా ?

by Dishanational4 |
హనుమంతుడి గురించి విదేశాంగ మంత్రి జైశంకర్ ఏమన్నారో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తన పదవీ బాధ్యతలను రామాయణంలో హనుమంతుడి పాత్రతో పోల్చుకున్నారు. హనుమంతుడు రామాయణంలో ఒక దౌత్యవేత్త పాత్రను కూడా పోషించారని చెప్పారు. ‘‘హనుమంతుడు పెద్ద దౌత్యవేత్త. రాముడు ఆయనను లంకకు రాయబారిగా పంపారు’’ అని తెలిపారు. ప్రతీ విషయానికి పశ్చిమ దేశాల నుంచి ఏదో ఒక టాపిక్‌ను అరువు తెచ్చుకునే బదులు.. దానికి భారతీయ నేపథ్యంలోనే ఉదాహరణలను గుర్తించడం మంచిదని జైశంకర్ అభిప్రాయపడ్డారు. ‘‘హనుమంతుడు కూడా ఒక ఇంటెలిజెన్స్ మిషన్‌‌తో లంకలో పనిచేశారు. సీతమ్మకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. లంక నుంచి బయటికి వచ్చేటప్పుడు చాకచక్యంగా ఆ నగరాన్ని దహనం చేశారు’’ అని పేర్కొన్నారు. రావణుడి సభలో హనుమంతుడు ఆడిన మైండ్ గేమ్‌ అత్యద్భుతమని కొనియాడారు. ‘‘రావణుడి సభలో రావణుడు, మంత్రుల కంటే ఎత్తైన సీటులో హనుమంతుడు కూర్చోగలిగాడు. దీంతో రావణుడు మానసికంగా చికాకుకు గురయ్యాడు. నేటి కాలమాన పరిస్థితుల్లోనూ ఇలాంటి వ్యూహాలను సందర్భాన్ని బట్టి దౌత్యపరంగా అమలు చేయొచ్చు’’ అని తెలిపారు.

Next Story

Most Viewed