18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్రం నిషేధం.. కారణమిదే..

by Dishanational5 |
18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్రం నిషేధం.. కారణమిదే..
X

దిశ, నేషనల్ బ్యూరో: అశ్లీల కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అసభ్యకరమైన, బూతు, పోర్నోగ్రఫిక్ కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించింది. వీటితోపాటు మరో 19 వెబ్‌సైట్లు, 10 మొబైల్ యాప్స్(7 గూగుల్ ప్లే నుంచి, 3 యాపిల్ యాప్ స్టోర్ నుంచి), 57 సోషల్ మీడియా అకౌంట్లనూ బ్యాన్ చేసింది. సృజనాత్మక వ్యక్తీకరణ ముసుగులో అశ్లీలత, అసభ్యతను ప్రచారం చేయకూడదని పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో చర్యలు తీసుకున్నట్టు కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి అనురాగ్ సింగ్ తాజాగా వెల్లడించారు. ఇన్మర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నిషేధానికి గురైన ఓటీటీ వేదికల్లో ‘డ్రీమ్స్ ఫిల్మ్’, ‘వూవీ’, ‘యెస్మా’, ‘ఎక్స్ ప్రైమ్’, ‘రాబిట్’, ‘ఫుగి’, ‘మూడ్ ఎక్స్’, ‘నియోన్ ఎక్స్’, ‘హాట్ షాట్స్ వీఐపీ’ వంటి సంస్థలు ఉన్నాయి. వీటిలో ఓ ఓటీటీ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో కోటి మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకోగా, మరో రెండింటికి 50లక్షలకు పైగా డౌన్‌లోడ్స్ ఉన్నట్టు తెలిపారు.


Next Story

Most Viewed