జ్ఞానవాపి మసీదు కాదు.. జ్యోతిర్లింగం! UP CM సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
జ్ఞానవాపి మసీదు కాదు.. జ్యోతిర్లింగం! UP CM సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసు వ్యవహారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపి మసీదు కాదన్నారు. అది ఓ జ్యోతిర్లింగం అని చెప్పారు. జ్ఞానవాపిని మసీదు అనడమే వివాదం అవుతుందని వ్యాఖ్యానించారు. ఏఎన్ఐతో మాట్లాడిన యోగి ఆదిత్యానాథ్.. జ్ఞానవాపి మసీదు ఆవరణలో త్రిశూలం, దేవుడి ప్రతిమలు ఉన్నాయన్నారు. జ్ఞానవాపి విషయంలో చారిత్రాత్మక తప్పు జరిగిందని ముస్లింలు అంగీకరించి జ్ఞానవాపిని తిరిగి అప్పగించాలన్నారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రతిపాదనను ముందుకు తీసుకురావాలన్నారు. జ్ఞాన్‌వాపి మసీదును అంతకు ముందే ఉన్న ఆలయంపై నిర్మించారా లేదా అని తెలుసుకునేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే చేపట్టే విషయంలో అలహబాద్ హైకోర్టు ఆగస్టు 3న తీర్పు వెలువరించబోతున్నది. ఈ నేపథ్యంలో యూపీ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు దుమారంగా మారాయి.



Next Story

Most Viewed