గ్వాలియర్లో పానీ పూరి అమ్ముతున్న కేజ్రీవాల్.. అసలు విషయం ఇదే..!

by Disha Web |
గ్వాలియర్లో పానీ పూరి అమ్ముతున్న కేజ్రీవాల్.. అసలు విషయం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పానీ పూరి అమ్ముతున్నారు. కస్టమర్లకు నోరూరించే సమోస, చాట్, కరోచీ అందిస్తున్నారు. అదేంటి.. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గ్వాలియర్ లో పానీ పూరి అమ్మడమేంటనే కదా మీ సందేహం. మీ డౌట్ కరెక్టే. గ్వాలియర్ లో పానీ పూరి అమ్ముతోంది కేజ్రీవాల్ కాదు.. ఆయన పోలికలతో ఉన్న మరో వ్యక్తి. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు కదా. అరవింద్ కేజ్రీవాల్ ను పోలిన వ్యక్తే ఈ చాట్ వాలా. అచ్ఛం కేజ్రీవాల్ లా ఉన్న ఈ చాట్ వాలా.. కేజ్రీవాల్ లాగే కళ్లద్దాలు, క్యాప్, చలి కోటు ధరిస్తాడు. అంతే కాదు హావభావాల్లో కూడా అచ్ఛం ఏకేను అనుసరిస్తుంటాడు. పలు పథకాలు ప్రవేశపెట్టి ఢిల్లీ ప్రజల కోసం కేజ్రీవాల్ పని చేస్తోంటే.. రుచికరమైన చాట్, సమోస, కచోరీ అందిస్తూ ఈ గ్వాలియర్ కేజ్రీవాల్ ఫేమస్ గా మారాడు. చాలా తక్కువ ధరలకే కస్టమర్లకు చాట్ అందిస్తూ స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

ఇక అచ్ఛం కేజ్రీవాల్ లా ఉండే ఈ చాట్ వాలా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫుడీవిశాల్ అనే వ్యక్తి పోస్ట్ చేసిన ఈ జూనియర్ కేజ్రీవాల్ వీడియోకు లక్షల్లో లైక్స్, వేలల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ''కేజ్రీవాల్ జీ.. మీరు ఇక్కడ చాట్ అమ్ముతుంటే ఢిల్లీలో ఎవరు పాలన చేస్తున్నారు'' అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
Next Story