ప్రధాని మోడీ ప్రారంభించిన బెంగుళూరు మెట్రో స్టేషన్లోకి వరద (వీడియోలు వైరల్)

by Disha Web Desk 6 |
ప్రధాని మోడీ ప్రారంభించిన బెంగుళూరు మెట్రో స్టేషన్లోకి వరద (వీడియోలు వైరల్)
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రారంభించి వారం రోజులు కూడా కాలేదు..అకాల వర్షాల కారణంగా వరద నీరు చేరి నిండిపోయింది. బెంగళూరులోని 13.71 కి.మీ పొడవైన నల్లూర్‌ హళ్లి మెట్రోస్టేషన్‌ ఫేజ్ IIను ప్రధాని నరేంద్రమోడీ గత వారం రోజుల క్రితం ప్రారంభించారు. ఏప్రిల్ 4న భారీవర్షం కారణంగా ఈ స్టేషన్‌లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుంచి కృష్ణరాజపురం వరకు నడిచే ఈ కొత్త మెట్రోలైన్‌ను రూ. 4,249 కోట్లతో నిర్మించారు.

అయితే, మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా వరద నీటితో నిండిపోయిన మెట్రోస్టేషన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో సిటిజన్ ఫోరమ్ వైట్‌ఫీల్డ్ రైజింగ్ ప్లాట్‌ఫారమ్‌పై, టికెటింగ్ కౌంటర్ వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ వీడియోను చూసిన కొంత మంది ప్రయాణికులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. చిన్నపాటి వర్షాలకే ఇలా అయితే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తి కాకుండానే మెట్రో స్టేషన్‌ను ఓపెన్ చేశారని, అందుకే ఇలా జరిగిందంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed