- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వచ్చే ఎన్నికల్లో మళ్లీ మోడీదే అధికారం: ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: జన సురాజ్ పేరుతో బీహార్‌లో యాత్ర చేస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉంటుందని తేల్చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీపై అనర్హత వేటుతో కాంగ్రెస్ పార్టీకి ఒరగబోయే లాభం ఏది లేదని తేల్చారు. ఈ దేశంలో బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీ కాంగ్రెసేనన్నారు.
రాహుల్ గాంధీ అనర్హత వేటుపై స్పందిస్తూ కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని ప్రజలు తమ వైఖరిని ప్రజలకు చెప్పడం లేదని.. అలాంటప్పుడు ఆ విషయం ప్రజలకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మోడీయే ముందు వరుసలో ఉంటారని బదులిచ్చారు. దేశంలో ప్రతిపక్షం బలహీనంగా లేదని వారి పోరాటాన్ని ఆయా పార్టీలే బలహీన పరుచుకుంటున్నాయన్నారు. కాగా ఓ వైపు మోడీని గద్దె దింపేందుకు విపక్షాలు ఏకంకావాలని ప్రయత్నాలు చేస్తున్న వేళ మరోసారి మోడీనే ముందు వరుసలో ఉంటారని ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.