లిక్కర్ స్కామ్ కేసులో మరో ఆప్ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు

by Dishanational2 |
లిక్కర్ స్కామ్ కేసులో మరో ఆప్ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌కు ఈడీ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆయనను ఈరోజే విచారించనున్నట్టు తెలుస్తోంది. సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలోనే దుర్గేష్‌కు సమన్లు జారీ చేయడం గమనార్హం. గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నగదు చెల్లింపులకు సంబంధించిన పలు ప్రకటనల్లో దుర్గేష్ పేరు కూడా ఉండటంతో ఆయనకు ఈడీ 2022లోనూ విచారణకు పిలిచింది. ఈ నేపథ్యంలోనే మరోసారి విచారించనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఆయన ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరుకానున్నట్టు సమాచారం. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఆప్ కీలక నేతలు అరెస్టవ్వగా..తాజాగా దుర్గేష్ పాఠక్‌కు సైతం సమన్లు జారీ చేయడంతో ఆప్ నేతల్లో ఆందోళన నెలకొంది. సౌత్ గ్రూప్ నుంచి తీసుకున్న రూ. 45 కోట్లను ఆప్ గోవా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిందని ఈడీ ఆరోపించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed