ఈడీ, సీబీఐ ఇండిపెండెంట్.. మాకు సంబంధంలేదు- కేంద్రమంత్రి

by Dishanational6 |
ఈడీ, సీబీఐ ఇండిపెండెంట్.. మాకు సంబంధంలేదు- కేంద్రమంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈడీ, సీబీఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థలను స్పష్టం చేశారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్. కేంద్ర దర్యాప్తు సంస్థలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. టైమ్స్ నౌ సమ్మిట్ లో పాల్గొన్న అనురాగ్ ఠాగూర్.. పదేళ్లలో ప్రధాని మోడీ అవినీతిపరుడని దేశంలో ఎవరూ ఆరోపణలు చేయలేదని తెలిపారు. ఇక, 2013లో ఢిల్లీ సీఎం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌తో ఎట్టిపరిస్థితుల్లో జత కట్టనన్న ఆప్.. ఇప్పుడు వారితోనే పొత్తుపెట్టుకుందని ఎద్దేవా చేశారు. ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలు సొంతంగా ఏం సాధించలేదన్నారు. ప్రతి రోజు కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తారు. వాళ్లు మోడీని ఎంత తిడితే.. బీజేపీ అభ్యర్థులను ప్రజలు అంత ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటారని అనురాగ్ ఠాకూర్ అన్నారు.

కేజ్రీవాల్ ని విమర్శిస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు అనురాగ్ ఠాగూర్. కేజ్రీవాల్‌కు దర్యాప్తు సంస్థ ఈడీ తొమ్మిది సార్లు నోటీసులు జారీ చేసింది అని తెలిపారు. ఈడీ విచారణకు ఎందుకు హాజరు కాలేదు అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. రూల్స్ పాటించని వాళ్లు.. విలువల గురించి మాట్లాడతారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ఈడీ ఆఫీసుకు హాజరు కాకపోతే.. ఈడీనే ఆయన ఇంటికి పోయింది.. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆప్‌ ఒక్క సీటు కూడా గెలవలేదని.. 2024 ఎన్నికల్లో కూడా ఆప్ ఒక్క సీటు గెలుచుకోలేదన్నారు. జైళ్లో ఉండి కూడా విలువల గురించి కేజ్రీవాల్ మాట్లాడడం దారుణమన్నారు. ఇక, ఈడీ, సీబీఐ స్వతంత్ర సంస్థలు వాటి పని అవి చేసుకుంటాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీకి ఎలాంటి సంబంధంలేదని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

ఇక ప్రతిపక్షాల ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు అనురాగ్ ఠాగూర్. కాంగ్రెస్ 2జీ, సబ్ మెరైన్, బొగ్గు కుంభకోణాల్లో ఉన్నారని అన్నారు. ఆ తర్వాత దాణా కుంభకోణం చేసిన లాలు ప్రసాద్‌ యాదవ్‌ను సైతం కూటమిలోకి చేర్చుకున్నారు. జైలుకు వెళ్లిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఇండియా కూటమిలో ఉన్నారని చురకలు అంటించారు.


Next Story

Most Viewed