బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు నోటీసులు ఇచ్చిన ఈసీ

by Disha Web Desk 12 |
బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు నోటీసులు ఇచ్చిన ఈసీ
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీపై ఘోష్, కంగనా రనౌత్‌పై సుప్రియా ష్రినేట్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఫైర్ అయింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ప్రాథమికంగా ఉల్లంఘించాయని EC పేర్కొంది. ఈ క్రమంలోనే ఘోష్, సుప్రియా ష్రినేట్ లకు నోటీసులు ఇచ్చిన ఈసీ.. మార్చి 29 శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు సమాధానం ఇవ్వాలని కోరింది. రాబోయే ఎన్నికలకు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుండి బీజేపీ అభ్యర్థి రనౌత్‌ను కించపరుస్తూ.. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి అభ్యంతరకరమైన పోస్ట్ చేయడంతో కాంగ్రెస్ నాయకురాలు సుప్రియ ఈ భారీ వివాదానికి దారితీసింది.


Next Story

Most Viewed