దేశంలో నెలరోజులుగా ఎన్నికల కోడ్.. పార్టీల తీరుపై ఈసీ సంతృప్తి

by Disha Web Desk 12 |
దేశంలో నెలరోజులుగా ఎన్నికల కోడ్.. పార్టీల తీరుపై ఈసీ సంతృప్తి
X

దిశ, వెబ్ డెస్క్: 2024 పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మార్చి 16 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా నేటికి నెలరోజులు అవుతుంది. ఆ నాటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా రాజకీయ పార్టీలు కోడ్‌ను పాటించడం పట్ల భారత ఎన్నికల సంఘం స్థూలంగా సంతృప్తి చెందినట్లు ప్రకటించింది. అలాగే కొన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ప్రచారం చాలా అయోమయ రహితంగా ఉన్నాయని ఈసీఐ భావించింది.

ముఖ్యంగా కొందరు నాయకులు మహిళా నాయకుల పట్ల వ్యవహరించిన తీరుపై తమకు వచ్చిన ఫిర్యాదులపై గట్టిగా స్పందించినట్లు స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ సమయంలో వారి వారి రాజకీయాలకు అనుగుణంగా చేసిన వ్యాఖ్యలు ఆరోపణలపై.. వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు దాదాపు 200 ఫిర్యాదులను దేశవ్యాప్తంగా అందించారిని వీటిలో ఇప్పటి వరకు 169 కేసుల్లో చర్యలు తీసుకున్నట్లు ECI తెలిపింది.


Next Story

Most Viewed