Coromandel express accident : ఒడిశా రైలు ప్రమాదానికి అసలు కారణం ఇదే!

by Disha Web Desk 2 |
Coromandel express accident : ఒడిశా రైలు ప్రమాదానికి అసలు కారణం ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలో తీవ్ర విషాదాన్ని నింపిన రైల్వే ప్రమాదానికి కారణం ఏంటనేది ఇప్పటికీ అధికారికంగా తెలియకపోడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అమాయకులను కబలించిన ఈ ప్రమాదంపై తాజాగా రైల్వే శాఖ స్పందించింది. ప్రమాదం సంభవించిన బాలాసోర్ రూట్లో 'కవచ్' వ్యవస్థ లేదని రైల్వే శాఖ ధృవీకరించింది. సహాయక చర్యలు పూర్తయ్యాయని, ట్రాక్ పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కూడా ఇలాంటి ఘోరం జరగడం సర్వత్రా విస్మయానికి గురి చేస్తోంది. రైలు ప్రమాదాలను నివారించేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తీసుకొచ్చిన కవచ్ వ్యవస్థ ఈ మార్గంలో ఏర్పాటు చేసి ఉంటే ఈ దారుణం ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ట్రైన్లలో యాంటీ కొలిజన్ వ్యవస్థ లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందనేది తన అభిప్రాయం అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. యాంటి కొలిజన్ డివైస్ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదంలో చనిపోయిన వారి ప్రాణాలు మనం తీసుకురాలేము. ఈ ప్రమాదంపై కేంద్రం సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా 2009లో ఇదే మార్గంలోనే కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనను పరిగణలోకి తీసుకునైనా ఈ రూట్లో కవచ్ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు ఎందుకు చేయలేదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

మరో వైపు ఈ ప్రమాదానికి కారణాలను ఇప్పుడే చెప్పలేమని నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. దర్యాప్తు పూర్తయితే ప్రమాదానికి కారణం ఏంటో తెలుస్తుందని అన్నారు. ఘటన జరిగి గంటల వ్యవధి గడుస్తున్నా ప్రమాదానికి స్పష్టమైన కారణం రైల్వే శాఖ వద్ద లేకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దేశంలో రైల్వే వ్యవస్థ ఏ దుస్థితిలో ఉందనడానికీ ఈ దుర్ఘటన ఓ నిదర్శనం అని టాక్ వినిపిస్తోంది.



Next Story

Most Viewed