ఢిల్లీలో రికార్డు కోవిడ్ మరణాలు.. పది రోజుల్లో..

by Disha Web Desk 13 |
ఢిల్లీలో రికార్డు కోవిడ్ మరణాలు.. పది రోజుల్లో..
X

న్యూఢిల్లీ: ఏప్రిల్ 19 నుంచి 27వ తేదీ మధ్య కాలంలో ఢిల్లీలో కనీసం 40 కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులలో కోవిడ్ సంబంధ వ్యాధులు ఉన్నవారు మృత్యువాత పడుతున్నట్టు చెప్పారు. రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదని నిపుణులు తెలిపారు. ఢిల్లీలో గురువారం ఏడు కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి.

అంతేకాదు 16.9 శాతం పాజిటివ్ రేటుతో కోవిడ్‌కు సంబంధించిన 865 కేసులు నమోదయ్యాయి. నగర ప్రభుత్వ ఆరోగ్య శాఖ తెలిపిన డేటా ప్రకారం ఈ కొత్త కేసులు, మరణాలతో దేశ రాజధానిలో కేసుల సంఖ్యం 20,37,061కు, మరణాల సంఖ్య 26,620కి చేరుకుంది. గురువారం నమోదైన ఏడు మరణాలలో మూడు కేసులలో కోవిడ్ ప్రధాన కారణమని డిపార్ట్‌మెంట్ బులెటిన్‌లో తెలిపింది.

బుధవారం ఢిల్లీలో 21.16 శాతం పాజిటివ్ రేటుతో 1,040 కేసులు నమోదయ్యాయి. ఏడు మరణాలు సంభవించాయి. మూడు మరణాలలో కోవిడ్ ప్రధాన కారణం. ఏప్రిల్ 21వ తేదీన నగర ఆరోగ్య శాఖ బులెటిన్‌ను విడుదల చేయలేదు. ఏప్రిల్ 19, 22, 25 తేదీల్లో ఒక్కోరోజు ఆరు కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. ఇక్కడి అపోలో ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సురంజిత్ ఛటర్జీ మాట్లాడుతూ.. ‘మరణాలు సంభవిస్తున్నాయి. కానీ ఎక్కువగా కోవిడ్ సంబంధిత వ్యాధులు ఉన్న వృద్ధులు దీని బారిన పడుతున్నారు. యువతలో 20 నుంచి 40 ఏళ్ల వయస్కుల వారిలో కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ అవి ప్రాణాంతకంగా మారడం లేదు. 13 నుంచి 14 మంది రోగులు మా ఆస్పత్రిలో చేరారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది’ అని చెప్పారు.


Next Story

Most Viewed