కేజ్రీవాల్ కు సొంత మంత్రి ఝలక్.. ఢిల్లీ మంత్రి రాజీనామా

by Disha Web Desk 13 |
కేజ్రీవాల్ కు  సొంత మంత్రి ఝలక్.. ఢిల్లీ మంత్రి రాజీనామా
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ తన మంత్రి పదవికి, పార్టీకి రాజనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన కేజ్రీవాల్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రాజకీయాలు మారితే దేశం మారిపోతుందని గతంలో అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్ నుంచి పిలుపునిచ్చారని.. రాజకీయాలు మారలేదు కానీ రాజకీయ నాయకుడు(కేజ్రీవాల్) మారాడు' అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరానని కానీ ఆ పార్టీ ప్రస్తుతం అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. ఇకపై ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పని చేయాలనేనని స్పష్టం చేశారు.

రాజీనామా వెనుక వ్యూహం?:

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో పార్టీ అధినేత కేజ్రీవాల్ సైతం ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. జైలుకు పాలైన నేపథ్యంలో ఆయన సీఎం పోస్టుకు రాజీనామా చేయాలని బీజేపీ పెద్దఎత్తున ఆందోళనలు చేస్తోంది. కానీ ఆమ్ ఆద్మీ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన కొనసాగిస్తారంటూ భీష్మించుకు కూర్చుంది. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు లో బీజేపీ అసలు ఉద్దేశం మరొకటి ఉందని ఆప్ ఆరోపిస్తోంది. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం కాదని ఆమ్ ఆద్మీ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేయాలన్నదే ఆ ప్లాన్ అని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఎంపీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్ట్ అయినా మిగతా మంత్రులు బీజేపీపై ఎటాక్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంతలో రాజ్ కుమార్ ఆనంద్ రిజైన్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజీనామా నిర్ణయం వెనుక నిజంగానే రాజ్ కుమార్ నిర్ణయం ఉందా లేక ప్రత్యర్థులతో చేరిపోయి రాజ్ కుమార్ రాజీనామా చేశారా అనేది ఆప్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఆప్ పార్టీ హిస్టరీలో లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ రోజుకో ట్విస్ట్ నమోదు చేస్తోందనే చర్చ జరుగుతో



Next Story