మునుపెన్నడూ లేని విధంగా యమునా నది నీటిమట్టం పెరిగింది.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

by Dishafeatures2 |
మునుపెన్నడూ లేని విధంగా యమునా నది నీటిమట్టం పెరిగింది.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో యమునా నది నీటిమట్టం మునుపెన్నడూ లేని విధంగా పెరిగిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. యమునా నది నీటిమట్టం 207.71 మీటర్లకు చేరుకుందని చెప్పారు. గత 2-3 రోజులుగా ఢిల్లీలో వర్షాలు కురవలేదన్న ఆయన.. హిమాచల్‌ప్రదేశ్‌, హర్యానా నుంచి వరద నీరు ఢిల్లీలోకి చేరుతోందని స్పష్టం చేశారు. ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ కూడా రాశానన్న ఆయన.. ఢిల్లీలోకి వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించాలని లేఖలో కోరినట్లు తెలిపారు.

అలా అయితేనే ఢిల్లీకి వరద నీటి ప్రవాహం ఆగి యమునా నది పొంగకుండా ఉంటుందని పేర్కొన్నారు. యమునా నదిలో నీటి మట్టం పెరగడం వల్ల అనేక ప్రాంతాలు ప్రభావితమయ్యాయని, లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను ఖాళీ చేయాలని సీఎం కోరారు. ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తుతున్న ఈ సమయంలో రాజకీయాలు చేయవద్దని కోరారు.


Next Story

Most Viewed