పెరుగు తెచ్చిన తంటా.. ఆ రాష్ట్రంలో మరోసారి హిందీ వ్యతిరేక ఉద్యమం

by Disha Web Desk 4 |
పెరుగు తెచ్చిన తంటా.. ఆ రాష్ట్రంలో మరోసారి హిందీ వ్యతిరేక ఉద్యమం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో మరోసారి హిందీ వ్యతిరేక అంశం తెరపైకి వచ్చింది. పెరుగు ప్యాకెట్ పై హిందీలో లేబుల్ ఉండాలని ఎఫ్ ఎస్ ఎస్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. నందిని పాల ఉత్పత్తి సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. కర్డ్ కాకుండా దహి అనే పదాన్ని వాడాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో కర్ణాటక ప్రభుత్వం తిరుగుబాటు చేయగా హిందీపై మరో ఉద్యమం తప్పదని సీఎం స్టాలిన్ తెలిపారు. పెరుగు ఉత్పత్తులపై కేంద్రం అజమాయిషీ తగదన్న తమిళనాడు సీఎం స్టాలిన్. మేం హిందీ భాషను వ్యతిరేకిస్తున్నామని స్టాలిన్ తెలిపారు. తమిళ ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దుతున్నారని ఫైర్ అయ్యారు. భాషా ఉద్యమాలతో అందరికీ బుద్ధి చెబుతామన్నారు.


Next Story

Most Viewed