రెండో దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు

by Disha Web Desk 17 |
రెండో దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశలో పోటీ చేస్తున్న 1192 మంది అభ్యర్థుల్లో 21 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక పేర్కొంది. అభ్యర్థులు తమ ఎన్నికల అఫడవిట్‌లో భాగంగా సమర్పించిన పత్రాల ఆధారంగా ఈ డేటా వెలుగులోకి వచ్చింది. వీరిలో 167 మంది (దాదాపు 14 శాతం) తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారని, 32 మంది అభ్యర్థులు దోషులుగా తేలిన కేసులను ప్రకటించారు. 3 అభ్యర్థులు వారిపై హత్య కేసులను ఉన్నట్టు తెలిపారని డేటా పేర్కొంది.

మొదటి దశ ఎన్నికల్లో భాగంగా, పోటీ చేస్తున్న 1,625 మంది అభ్యర్థుల స్వీయ ప్రమాణ పత్రాల్లో 1,618 మంది పత్రాలను విశ్లేషించగా, 16 శాతం (252) మందిపై క్రిమినల్ కేసులు,10 శాతం (161) మంది తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొగా, ఏడుగురిపై హత్య కేసులు, 19 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయని నివేదిక తెలిపింది. అలాగే, మొదటి దశలో 102 లోక్‌సభ స్థానాల్లో 42 స్థానాల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని నివేదిక హైలైట్ చేసింది.


Next Story

Most Viewed