ప్రశాంత్ కిషోర్ ఎన్నికల జోస్యం 'హాస్యాస్పదం, బీజేపీ స్పాన్సర్డ్': కాంగ్రెస్

by Dishanational1 |
ప్రశాంత్ కిషోర్ ఎన్నికల జోస్యం హాస్యాస్పదం, బీజేపీ స్పాన్సర్డ్: కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నంబర్ 1కి వచ్చి దక్షిణాది రాష్ట్రాల్లో గణనీయంగా పుంజుకోవచ్చని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ పీకే వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ మాట్లాడుతూ.. పీకే జోస్యం 'బీజేపీ స్పాన్సర్డ్ షో' లా ఉందన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆర్ఎస్ఎస్ వ్యక్తే అయినా మారువేశంలో రాజకీయ విశ్లేషకుడిగా మారాడు. కాబట్టి అతని వ్యాఖ్యలను బీజేపీ ప్రాయోజిత కార్యక్రమమని పిలవాలని అన్నారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పీకే కాంగ్రెస్ కూటమిలో ఉన్నప్పుడు ప్రయత్నించారని, ఆ తరాత బీజేపీలో చేరాక ఆ విషయాన్ని పట్టించుకోలేదని అజోయ్ కుమార్ తెలిపారు. ఇదే సమయంలో వంశపారంపర్య రాజకీయాలకు సంబంధించి బీజేపీ ఆరోపణలను అజోయ్ కుమార్ ఖండించారు. 27 ఏళ్లుగా గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్‌కు ప్రధాని లేరనే విషయం గుర్తించాలన్నారు. మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి కాంగ్రెస్ ఆరోపణలను నిరాకరించింది. ఎవరు నిజాలు చెబితే వారిని ఆర్ఎస్ఎస్‌గా కాంగ్రెస్ అభివర్ణిస్తోందని వెల్లడించారు.

Next Story

Most Viewed