కేంద్ర ప్రభుత్వ ‘ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్’.. ఏం చేస్తుందో తెలుసా ?

by Dishanational4 |
కేంద్ర ప్రభుత్వ ‘ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్’.. ఏం చేస్తుందో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన కంటెంట్‌పై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో జరుగుతున్న ప్రచారాన్ని పర్యవేక్షించడానికి అధికారికంగా ‘ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌’ను ఏర్పాటు చేసింది. ఇటీవల సవరించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని నిబంధనలకు అనుగుణంగా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, మీడియా సంస్థలు, ఇన్ ఫ్లూయెన్సర్లు, జర్నలిస్టులు ప్రచురించే ప్రభుత్వ కార్యక్రమాల కంటెంట్‌లోని వాస్తవికతపై ఈ ‘ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌’ నిఘా పెడుతుంది. వాటిలో వాస్తవికత లోపిస్తే ఆయా అకౌంట్ల వారికి నిజమైన సమాచారాన్ని అందించి అలర్ట్ చేస్తుంది. ఈవివరాలను కేంద్ర ఐటీ శాఖ బుధవారం ఓ నోటిఫికేషన్‌లో తెలియజేసింది.

Next Story

Most Viewed