ఓపీఓఆర్ బకాయిల చెల్లింపుపై సుప్రీం కీలక తీర్పు

by Dishafeatures2 |
ఓపీఓఆర్ బకాయిల చెల్లింపుపై సుప్రీం కీలక తీర్పు
X

న్యూఢిల్లీ: వన్ ర్యాంక్ వన్ పెన్షన్ బకాయిల చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28లోగా 2019-2022కి గాను వారికి రూ. 28,000 కోట్ల బకాయిలు చెల్లించాలని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. మాజీ సైనికోద్యోగులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ బకాయిల చెల్లింపుపై 2022 నాటి తీర్పును పాటించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. కేంద్రం బకాయిల చెల్లింపులో కేంద్రం సీల్డ్ కవర్ ను స్వీకరించేందుకు సీజేఐ డీవై చంద్రచూడ్ అధ్వర్యంలోని బెంచ్ నిరాకరించింది. ఓఆర్‌ఓపీ స్కీమ్ నిబంధనలలో ఈ కోర్టు తీర్పును పాటించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. 25 లక్షల మంది పింఛనుదారులలో నాలుగు లక్షల మంది OROP పథకానికి అర్హత పొందలేదని, వారు మెరుగైన పెన్షన్‌లను పొందుతున్నందున, ఏప్రిల్ 30, 2023 నాటికి బకాయిలను చెల్లించాలని కేంద్రం ప్రతిపాదించిందని ధర్మాసనం పేర్కొంది.

అంతేకాకుండా ఆరు లక్షల ఫ్యామిలీ పెన్షనర్లు, గ్యాలంట్రీ అవార్డు విన్నర్లకు ఏప్రిల్ 30లోగా బకాయిలు చెల్లించాలని తెలిపింది. 70 ఏళ్లు పైబడిని పెన్షన్ దారులకు జూన్ 30లోగా బకాయిల చెల్లింపు పూర్తి చేయాలని ఆదేశించింది. మరోవైపు కేంద్రం సీల్డ్ కవర్ నోట్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విధానానికి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపింది. నిష్పాక్షిక న్యాయానికి ఇది ప్రాథమికంగా విరుద్ధమని తెలిపింది. మరోవైపు తాను వ్యక్తిగతంగా సీల్డ్ కవర్ విధానానికి వ్యతిరేకమని సీజేఐ అన్నారు. కోర్టులో పారదర్శకత అవసరమని చెప్పారు. అంతకుముందు కూడా విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామన్న కేంద్రం నిర్ణయాన్ని కోర్టు తప్పుబట్టింది.




Next Story

Most Viewed