సీఏఏపై మోడీ వర్సెస్ దీదీ

by Dishanational4 |
సీఏఏపై మోడీ వర్సెస్ దీదీ
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత మాతపై విశ్వాసం కలిగిన వారు విదేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేసినా పౌరసత్వాన్ని అందించాలనే గొప్ప లక్ష్యంతోనే సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)ను తీసుకొచ్చామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పారు. మమతా బెనర్జీ పార్టీ బెంగాల్ రాష్ట్రంలో సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి మోడీ గురువారం పశ్చిమబెంగాల్‌లోని కూచ్ బీహార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగించారు.సందేశ్‌ఖాలీ ఘటనను మరోసారి ప్రధాని ప్రస్తావించారు. నిందితుడ్ని రక్షించేందుకు బెంగాల్ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసిందని మోడీ ఆరోపించారు. బెంగాల్‌లో మహిళలపై జరిగే దారుణాలను బీజేపీ మాత్రమే నిలువరించగలదని స్పష్టం చేశారు. మరోవైపు ‘‘ఇక సీఏఏలో రిజిస్ట్రేష‌న్ కోసం మీ పేరును స‌మ‌ర్పించ‌గానే బంగ్లాదేశీగా ప్ర‌క‌టిస్తారు.. అంటే ల‌క్షీశ్రీ, క‌న్యాశీ ల‌బ్ది స్కీంలను పొందడం ఇక కుదరదు. వీళ్లు ఓటు వేయ‌లేరు.వారికి పౌరస‌త్వ హ‌క్కులు, ప్ర‌భుత్వ హ‌క్కులు ఉండ‌వు’’ అని దీదీ చెప్పారు.


Next Story

Most Viewed