గిరిజనుడిపై మూత్రం పోసిన వ్యక్తిపై చర్యలు.. ఊహించని శిక్ష (వీడియో)

by Dishafeatures2 |
గిరిజనుడిపై మూత్రం పోసిన వ్యక్తిపై చర్యలు.. ఊహించని శిక్ష (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: బాగా తాగిన ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి ఓ గిరిజనుడిపై మూత్రం పోశారు. అత్యంత దారుణమైన ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అక్కడి ప్రభుత్వం నిందితుడిపై చర్యలకు పూనుకొంది. ఈ క్రమంలోనే అక్రమంగా ఇంటిని నిర్మించాడంటూ ప్రవేశ్ పటేల్ ఇంటి కొంతభాగాన్ని బుల్డోజర్ తో కూలగొట్టారు. బుధవారం నిందితుడి ఇంటి వద్దకు పదుల సంఖ్యలో వచ్చిన పోలీసులు, అధికారులు జేసీబీతో అతడి ఇంటిని కూలగొట్టారు.

ఇక అంతకు ముందు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ప్రవేశ్ శుక్లా మానవత్వాన్ని మరిచి నీచంగా ప్రవర్తించాడు, ఇది తీవ్రమైన నేరమని అన్నారు. ఈ నేరానికి నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ఆదేశాలు ఇచ్చానన్న సీఎం.. భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా అతడికి గట్టి శిక్ష పడే వరకు వదిలిపెట్టమని చెప్పారు. ఇక మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందిస్తూ ఇది అత్యంత దారుణమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed