BREAKING: జ్ఞాన్‌వాపి మసీదులో పూజలపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ

by Disha Web Desk 1 |
BREAKING: జ్ఞాన్‌వాపి మసీదులో పూజలపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: జ్ఞాన్‌వాపి మసీదు దక్షిణ సెల్లార్‌లో హిందూ పార్టీలు పూజలు చేసుకోవడానికి జనవరి 31న వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు దేశ అత్యన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం, రెండు వర్గాల వారు మతపరమైన ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా జ్ఞానవాపి ప్రాంగణంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొంది. హిందువులు దక్షిణ ద్వారం నుంచి ప్రవేశించి సెల్లార్‌లో ప్రార్థనలు చేస్తారని, ముస్లిం ఉత్తరం వైపున ప్రార్థన చేస్తారని కోర్టు పేర్కొంది. కేసు తుది తీర్పు వచ్చే వరకు ఇవే ఆంక్షలు అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.

కాగా, సెల్లార్‌లో పూజలు చేయడంపై స్టేను తిరస్కరించిన కోర్టు, పూజ జరిగే సెల్లార్‌ ప్రాంతం, ముస్లింలు ప్రార్థనలు చేసే ప్రాంతం వేరువేరుగానే ఉన్నాయని హిందూ సంఘాల న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ముస్లింలు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రార్థనలు చేస్తున్నారని, పూజలు సెల్లార్ ప్రాంతానికి పరిమితమయ్యాయని కోర్టు కూడా పేర్కొంది. దక్షిణ భాగంలోని సెల్లార్‌లో చేస్తున్న పూజల వల్ల ఉత్తర భాగంలోని ముస్లింల ప్రార్థనలపై ప్రభావం చూపబోవని తాము భావిస్తున్నమని సీజేఐ చంద్రచూడ్‌ తెలిపారు. ఈ పద్ధతే సరైనదని, యథాతథ స్థితిలో ఇంకెలాంటి మార్పు రాకూడదంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed