బ్రేకింగ్ న్యూస్.. బీజేపీ ఎంపీ కన్నుమూత

by Disha Web Desk 9 |
బ్రేకింగ్ న్యూస్.. బీజేపీ ఎంపీ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం అంబాల బీజేపీ ఎంపీ రతన్ లాల్ కటారియా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో ఉన్న ఆయన కొన్ని రోజులుగా చండీగఢ్ లోని పీజీఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు. కాగా కటారియా.. గత 50 సంవత్సరాలుగా.. ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్‌గా ప్రసిద్ధి చెందారు. అలాగే.. హరిజన్ కళ్యాణ్ నిగమ్ అధ్యక్షుడిగా, గురు రవిదాస్ సభ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 1951 డిసెంబర్ 19న హర్యానాలోని యమునా నగర్ జిల్లా సంధాలీ గ్రామంలో ఎంపీ రతన్ లాల్ కటారియా జన్మించారు. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

అతను కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో BA ఆనర్స్, మాస్టర్ డిగ్రీతో పాటు LLB చేసాడు. 1999లో జరిగిన 13వ లోక్ సభ ఎన్నికల్లో ఆయన అంబాలా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో కూడా ఎంపీగా గెలుపొందారు. అలాగే.. 2019లో కేంద్ర జల్ శక్తి, సామాజిక న్యాయ సాధికారత కేంద్ర మంత్రిగా పనిచేశాడు. 2000 నుంచి 2003 వరకు భారతీయ జనతా పార్టీ, హర్యానా అధ్యక్షుడిగా పనిచేశారు. 1985లో రాడౌర్ విధానసభ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో హర్యానా ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా కూడా పనిచేశారు.

Next Story

Most Viewed