ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ కుట్ర: ఆప్ సంచలన ఆరోపణలు

by Dishanational2 |
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ కుట్ర: ఆప్ సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ తమ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపించింది. పంజాబ్‌లోని ముగ్గురు ఎమ్మెల్యేలకు బీజేపీ నుంచి కాల్స్ వచ్చాయని ఆప్ నేత ఢిల్లీ మంత్రి సౌరబ్ భరద్వాజ్ తెలిపారు. ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్ ప్రభుత్వాలను అస్థిరపర్చేందుకు కుట్రపన్నుతోందని వ్యాఖ్యానించారు. సీఎం కేజ్రీవాల్ గతంలో చెప్పిందే నిజమైందని గుర్తు చేశారు. కమలం పార్టీ ఆపరేషన్ లోటస్ నడుపుతోందని విమర్శించారు. ఢిల్లీ, పంజాబ్ ప్రజలు కేజ్రీవాల్‌ను నమ్మి ఓటువేశారని కానీ బీజేపీ ప్రభుత్వాలను పడగొట్టేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కాగా, ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలు జగ్‌దీప్ కాంబోజ్ గోల్డీ, అమన్‌దీప్ సింగ్, రాజిందర్ పాల్ కౌర్ చైనాలకు బీజేపీ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని, కానీ పార్టీనీ వీడేది లేదని వారు స్పష్టం చేశారు. కేజ్రీవాల్, ఆప్‌ని చూసి బీజేపీ భయపడుతోందని చెప్పారు. మరోవైపు సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆయననకు ఈడీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనుంది. అలాగే జైలులో ఉన్న ఆయన సీఎం పదవికి రాజీనామా చేయకపోవడంపై ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై కూడా నేడు విచారణ జరగనుంది. కేజ్రీవాల్ అరెస్టుతో ఆప్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్నట్టు తెలుస్తోంది.


Next Story

Most Viewed