లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, తేజస్వీలకు బెయిల్ మంజూరు

by Disha Web Desk 1 |
లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, తేజస్వీలకు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, వారి కుమారుడు ప్రస్తుత బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2004 నుంచి 2009 వరకు కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో లాలూ ప్రసాద్ పేరు మీద భూమిని బదలాయించిన వారికి ప్రతిఫలంగా భారతీయ రైల్వేలో నియామకాలు జరిగినట్లు అభియోగం ఉంది. ఈ మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జూలై 3న లాలూ ప్రసాద్ యాదవ్, ఇతరులపై తాజా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ చార్జ్‌షీట్‌లో రైల్వే నిబంధనలు, మార్గదర్శకాలు, విధానాలను ఉల్లంఘించి సెంట్రల్ రైల్వేస్‌లో అభ్యర్థుల అక్రమ నియామకాలు జరిగాయని వెల్లడించారు. ఈ క్రమంలో వారు బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐ స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. అవినీతి, నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతో సహా వివిధ నేరాల విషయంలో ప్రాధమిక సాక్ష్యాలని చూపాలని కోర్టు పేర్కొంది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.

Next Story

Most Viewed