అంతరిక్షంలో మూత్రాన్ని స్వచ్ఛమైన నీటిగా మార్చిన వ్యోమగాములు..

by Disha Web Desk 13 |
అంతరిక్షంలో మూత్రాన్ని స్వచ్ఛమైన నీటిగా మార్చిన వ్యోమగాములు..
X

వాషింగ్టన్ : అంతరిక్షంలో తమ మూత్రాన్ని స్వచ్ఛమైన నీటిగా మార్చడంలో వ్యోమగాములు సక్సెస్ అయ్యారు.. నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన వ్యోమగాములు ఈ టెక్నాలజీని సక్సెస్ ఫుల్‌గా టెస్ట్ చేశారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు తేమను సంగ్రహించి, స్వేదనం చేయడం ద్వారా మూత్రం నుంచి క్లీన్ వాటర్‌ను ఉత్పత్తి చేశారు. అంతరిక్షంలో తేమ ఉండదు. అయితే అక్కడున్న వ్యోమగాముల శ్వాస, చెమట నుంచి విడుదలయ్యే తేమను వాడుకున్నారు. ఈ తేమతో పాటు మూత్రాన్ని వాటర్ ప్రాసెసర్ అసెంబ్లీ (WPA) అనే మెషీన్‌లోకి పంపారు.

అందులో ప్రాసెసింగ్ జరిగిన తర్వాత యూరిన్ ప్రాసెసర్ అసెంబ్లీ (UPA) అనే మరో మెషీన్‌లోకి పంపుతారు.. ఈ యంత్రంలో వాక్యూమ్ డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా మూత్రం నుంచి స్వచ్ఛమైన నీటిని తిరిగి పొందుతారు. అయితే ఈ ప్రక్రియలో మూత్రం నుంచి ఉప్పునీరు మాత్రమే లభిస్తుంది. ఉప్పునీటిని ఇంకో దశలో శుద్ధి చేసి.. మంచినీటిగా మార్చడానికి శాస్త్రవేత్తలు బ్రైన్ ప్రాసెసర్ అసెంబ్లీ (BPA) అనే కొత్త టెక్నాలజీని పరీక్షిస్తున్నారు.

ఇది సున్నా గురుత్వాకర్షణ కలిగిన అంతరిక్ష వాతావరణంలో కూడా పనిచేస్తుంది. బ్రైన్ ప్రాసెసర్ అసెంబ్లీ (BPA) అనే టెక్నాలజీ అనేది.. యూరిన్ ప్రాసెసర్ అసెంబ్లీ (UPA) ద్వారా ఉత్పత్తి అయ్యే ఉప్పునీటిని తీసుకొని తేమతో కూడిన నీటిలా మారుస్తుంది. వ్యోమగాముల శ్వాస, చెమట నుంచి విడుదలయ్యే తేమను ఈ క్రమంలో అది వాడుకుంటుంది.

అంతరిక్ష నౌకలో నీరు పాత్ర..

అంతరిక్ష నౌకలో లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లను నిలబెట్టడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి, ఉష్ణోగ్రత, తేమ స్థాయిలను నియంత్రించడానికి నీటిని ఉపయోగిస్తారు. నీరు ఒక రేడియేషన్ షీల్డ్‌గా కూడా పనిచేస్తుంది. హానికరమైన కాస్మిక్ రేడియేషన్ నుంచి రక్షణను అందిస్తుంది. అంతరిక్షంలో మొక్కలను పెంచడానికి, ప్రయోగాలు చేయడానికి, అంతరిక్ష యాత్రల సమయంలో ఆహార ఉత్పత్తిని సులభతరం చేయడానికి నీరు ఒక ముఖ్యమైన వనరుగా దోహదం చేస్తుంది.

Next Story

Most Viewed