బుల్లెట్ రైలు ట్రాక్, స్పీడ్ గురించిన అప్‌డేట్‌లను షేర్ చేసిన అశ్విని వైష్ణవ్

by Disha Web Desk 17 |
బుల్లెట్ రైలు ట్రాక్, స్పీడ్ గురించిన అప్‌డేట్‌లను షేర్ చేసిన అశ్విని వైష్ణవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై- అహ్మదాబాద్ మధ్య త్వరలో ప్రారంభం కాబోయే బుల్లెట్ రైలు విషయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బుల్లెట్ రైలు కోసం భారతదేశపు మొట్టమొదటి బ్యాలస్ట్‌లెస్ ట్రాక్‌లో గణనీయమైన పురోగతిని సాధించామని అన్నారు. ఈ ట్రాక్‌లో గంటకు 320 కి.మీ వేగంతో రైళ్లు ప్రయాణించడానికి స్పీడ్ థ్రెషోల్డ్ ప్రక్రియ పూర్తయిందని, అలాగే, ప్రాజెక్టు పనులకు సంబంధించి ఇప్పటికే 153 కి.మీ వయాడక్ట్, 295.5 కి.మీ పైర్ వర్క్ పూర్తయిందని, మరిన్ని అప్‌డేట్‌లు మోడీ 3.0లో వస్తాయని ఎక్స్‌లో వైష్ణవ్ రాసారు.

కొద్ది రోజుల క్రితం బుల్లెట్ రైలు భద్రతా చర్యలను మరింత మెరుగుపరచడానికి ఎనిమోమీటర్‌లను ఇన్‌స్టాల్ చేయాలని వైష్ణవ్ అన్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌ను మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ హై-స్పీడ్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సాధించిన పురోగతిని హైలైట్ చేస్తుంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. గతంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ 2026 నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలు పట్టాలు ఎక్కుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత 2028 నాటికి ఈ మార్గంలో పూర్తి స్థాయిలో బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.


Next Story

Most Viewed