కేజ్రీవాల్ సహకరించట్లేదు.. విచారణలో అతిషీ పేరు తీశారు.. కోర్టుకు తెలిపిన ఈడీ

by Dishanational6 |
కేజ్రీవాల్ సహకరించట్లేదు.. విచారణలో అతిషీ పేరు తీశారు.. కోర్టుకు తెలిపిన ఈడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదని పేర్కొంది ఈడీ. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలో ఉన్నారు కేజ్రీవాల్. కస్టడీ ముగియడంతో కోర్టు ఎదుట కేజ్రీవాల్ ను హాజరు పరిచింది ఈడీ. ఆ సమయంలో కేజ్రీవాల్ విచారణకు సహకరించట్లేదని కోర్టుకు తెలిపారు ఎస్వీరాజు. విచారణను తప్పుదారి పట్టించేందుకు యత్నించినట్లు వివరించారు. విచారణ సమయంలో ఢిల్లీ మంత్రి అతిషీ పేరుని తీసినట్లు తెలిపారు. విజయ్ నాయర్ తనకు రిపోర్టు చేయలేదని.. అతిశీనే సంప్రదించాడని పేర్కొన్నారు. కేజ్రీవాల్ తన ఫోన్ పాస్ వార్డ్ చెప్పట్లేదని ఆరోపించారు.

జ్యుడీషియల్ కస్టడీకి సంబంధించిన దరఖాస్తుకు ఈ వాదనలు ఎంతవరకు సమంజసం అని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజా ప్రశ్నించారు. జ్యుడీషియల్ కస్టడీ తర్వాత ఈడీ కస్టడీ కోరే హక్కు తమకు ఉందని పేర్కొన్నారు ఏఎస్ జీ ఎస్వీరాజు. మరోవైపు కేజ్రీవాల్ విచారణ సందర్భంగా ఆప్ మంత్రులు అతిషీ, సౌరభ్ భరద్వాజ్, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కోర్టుకు హాజరయ్యారు.

Read More..

ఆయన చేస్తుంది దేశానికి మంచిది కాదు.. మోడీపై కేజ్రీవాల్ విమర్శలు



Next Story