బ్రేకింగ్ న్యూస్.. ముగిసిన అనంతనాగ్ ఎన్‌కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు మృతి

by Mahesh |
బ్రేకింగ్ న్యూస్.. ముగిసిన అనంతనాగ్ ఎన్‌కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతనాగ్ ఎన్‌కౌంటర్ 7 రోజుల తర్వాత ముగిసింది. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత ఆర్మీ సిబ్బంది వ్యూహరచన చేస్తున్న క్రమంలో ఉగ్రవాదులు చేసిన కాల్పుల్లో ముగ్గురు ఆర్మీ అధికారులు మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం ఉగ్రవాదుల కోసం అనంతనాగ్ పర్వత ప్రాంతాల్లో తీవ్రంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దీంతో ఈ రోజు భారత ఆర్మీ ఇద్దరు ఉగ్రవాదులను కాల్చేసింది. ఇద్దరు ఉగ్రవాదులలో ఒక LeT కమాండర్ కూడా ఉండగా.. eT కమాండర్ ఉజైర్ ఖాన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో ఉగ్రవాది మృతదేహం కోసం వెతుకుతున్నారు. కాగా కాల్పుల జరిగిన ప్రాంతంలోకి ళ్లవద్దని పోలీసు ఉన్నతాధికారి విజయ్ కుమార్ ప్రజలకు సూచించారు. అలాగే ఇంకా మిగిలి ఉన్న ఉగ్రవాదుల కోసం ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.

Next Story