బీజేపీ వారసత్వ రాజకీయ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ కౌంటర్

by Dishanational1 |
బీజేపీ వారసత్వ రాజకీయ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడు రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. బీజేపీ నేతలు తరచుగా చేసే డీఎంకే పార్టీ కుటుంబ పార్టీ వ్యాఖ్యలపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ చేసే వారసత్వ, కుటుంబ రాజకీయ వ్యాఖ్యలపై ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. 'బీజేపీ విమర్శించినట్టు డీఎంకే పార్టీ కుటుంబ వారసత్వ పార్టీయే. అందుకు తాను కూడా అంగీకరిస్తాను. కానీ, తమిళనాడు ప్రజలు మొత్తం కరుణానిధి కుటుంబమనే విషయం తెలుసుకోవాలని' పేర్కొన్నారు. ఇదే సమయంలో మాజీ సీఎం, ఏఐఏడీఎంకే నేత పళనిస్వామిని ఉద్దేశించిన మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్.. 'ఏఐఏడీఎంకే జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు రాష్ట్రంలో నీట్ పరీక్ష జరగలేదు. కానీ, ఆమె చనిపోయిన తర్వాత బానిస ప్రభుత్వం(గత ఏఈఏడీఎంకే) బీజేపీకి భయపడి రాష్ట్రంలో నీట్ పరీక్షను నిర్వహించేందుకు అనుమతిచ్చింది. దీనివల్ల 22 మంది విద్యార్థులు మరణించారని' తెలిపారు. కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైలో జరిగిన ర్యాలీ సందర్భంగా ప్రసంగిస్తూ, ఎంకే స్టాలిక్ డీఎంకే పార్టీ వారసత్వ కుటుంబ పార్టీ అని విమర్శలు చేశారు. కుటుంబ పార్టీలు తమ భవిష్యత్తు మాత్రమే చూసుకుంటాయని అన్నారు. నేను దేశంలో ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం కృషి చేస్తానని మోడీ పేర్కొన్నారు.



Next Story

Most Viewed