యూపీ సీఎం యోగిపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ తీవ్ర విమర్శలు

by Disha Web Desk 16 |
యూపీ సీఎం యోగిపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ తీవ్ర విమర్శలు
X

లక్నో: ఉత్తరకాశీలో సొరంగం కూలి 40 మంది చిక్కుకున్న ఘటనలో కార్మికులను రక్షించడంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. సిల్క్యారాలోని సొరంగంలో కార్మికులు చిక్కుకుని వారం రోజులు గడుస్తున్న యోగి ఆదిత్యనాథ్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. 'ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులందరినీ సురక్షితంగా రక్షించాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానిది. ఈ విపత్కర సమయంలో, ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది మంది కార్మికులతో పాటు ఇతర (చిక్కుకున్న) కార్మికుల కుటుంబాలకు మనోధైర్యాన్ని పెంచేందుకు మేము అండగా నిలబడతామని'ఆదివారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

కాగా, సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ ఎనిమిదో రోజుకు చేరింది. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) రెస్క్యూ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఒక్కో సెక్టార్‌ను ఒక్కో ఏజెన్సీకి కేటాయించింది.]

ఇక, ఆదివారం ఘటనా స్థలానికి వెళ్లిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహాయక చర్యలను సమీక్షించారు. ఆయనతో పాటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ధామి, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ సంధు ఉన్నారు. ఆగర్ మెషిన్ డ్రిల్లింగ్ సక్రమంగా పనిచేస్తే మరో రెండు రోజుల్లో రెస్క్యూ టీమ్ కార్మికులను చేరుకోవచ్చని గడ్కరీ చెప్పారు.


Next Story

Most Viewed