బీజేపీతో మళ్లీ కలిసే ప్రసక్తే లేదు.. అన్నా డీఎంకే మరోసారి క్లారిటీ

by Disha Web Desk 2 |
బీజేపీతో మళ్లీ కలిసే ప్రసక్తే లేదు.. అన్నా డీఎంకే మరోసారి క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీతే తెగదెంపులు చేసుకున్న అన్నాడీఎంకే తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. కాషాయ పార్టీతో మళ్లీ కలిసేది లేదని ఏఐఏడీఎంకే నేత మునుస్వామి క్లారిటీ ఇచ్చారు. ఎన్డీయే కూటమి నుంచి అన్నా డీఎంకే బయటకు రావడం ఎన్నికల స్టంట్ అని ఎన్నికల అనంతరం ఈ రెండు పార్టీలు తిరిగి ఒక్కటి అవుతాయని తమిళనాడు సీఎం స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్ విమర్శలపై మునుస్వామి స్పందించారు. తాము ఎన్డీయేలో మళ్లీ చేరబోయేది లేదని స్పష్టం చేశారు. పళనిస్వామి నేతృత్వంలో నూతన కూటమి ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామ‌లైని ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని త‌మ పార్టీ కోర‌లేద‌ని చెప్పారు.

కాగా, అన్న డీఎంకే ఏర్పాటు చేయబోయే కొత్త కూటమి జాతీయ స్థాయిలో ఉండబోతున్నదా? లేక రాష్ట్ర స్థాయికే పరిమితం అవుతుందా అనేది స్పష్టం ఇవ్వలేదు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సౌతిండియాపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. నార్త్ ఇండియాలో సీట్లు తగ్గినా దక్షిణ భారత్‌లో పట్టు సాధించడం ద్వారా ఆ గ్యాప్‌ను పూరించుకుని తిరిగి అధికారంలోకి రావాలని కమలం పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అన్న డీఎంకే ఎన్డీయే కూటమికి దూరం కావడంతో తమిళనాట రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

Next Story

Most Viewed