నడిరోడ్డుపై రైలు బోగీలు.. ఏమైందో తెలుసా ?

by Hajipasha |
నడిరోడ్డుపై రైలు బోగీలు.. ఏమైందో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఫొటోను చూశారా ? రోడ్డుపై అడ్డంగా ట్రైన్ పడి ఉంది కదూ !! ఇది చూసి.. ట్రైను రోడ్డుపైకి దూసుకొచ్చింది అనుకునేరు !! అలాంటి బీభత్సమేం జరగలేదు !! అసలేమైందంటే.. రైలు కోచ్‌‌ను తీసుకెళ్తున్న ఒక ట్రక్కు ఆదివారం బిహార్‌లోని భాగల్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. దీంతో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న లోహియా బ్రిడ్జి వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. రైలు కోచ్‌తో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి లోహియా బ్రిడ్జి రెయిలింగ్‌లలో ఒకదాన్ని ఢీకొట్టింది. దీంతో ట్రక్కు అదుపు తప్పింది. దానిపై ఉన్న రైలు కోచ్ ముందుకు కదిలి.. ట్రక్కు డ్రైవర్ కూర్చునే భాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలై కిందపడిపోయాడు. లక్కీగా.. రెయిలింగ్‌ అడ్డు తగలడంతో ట్రక్కు ఆగిపోయింది. లేదంటే పరిసరాల్లోని భవనాల్లోకి ట్రక్కు దూసుకెళ్లి ఉండేది. పోలీసులు, రైల్వే సిబ్బంది కలిసి రైలు కోచ్‌ను అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ దాదాపు మూడు గంటల తర్వాత ట్రాఫిక్ జామ్ తొలగిపోయింది.

Advertisement

Next Story