కాంగ్రెస్ కొనసాగుతున్న మోడీ విమర్శల పర్వం..!

by Dishanational6 |
కాంగ్రెస్ కొనసాగుతున్న మోడీ విమర్శల పర్వం..!
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీపై మోడీ విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. రాజస్థాన్ సభలో చొరబాటు దారులకు సంపదను పంచిపెడుతున్నారన్న మోడీ.. ఇప్పుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా మారిందన్నారు. రాజస్థాన్‌లోని టోంక్ లో ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో హనుమానా చాలిసా విన్న ఒక వ్యక్తిపై దాడి చేసిన ఘటనను వివరించారు.

ఒక పేద వ్యక్తి తన చిన్న దుకాణంలో హనుమాన్ చాలీసా వింటూ కూర్చున్నాడని.. అతడ్ని రక్తం వచ్చేలా చితకబాదారని మండిపడ్డారు. కర్ణాటకలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధ్వజమెత్తారు. ఒకరు తమ విశ్వాసాన్ని ఆచరించడం కూడా కాంగ్రెస్ హయాంలో సమస్యగా మారుతుందన్నారు. అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హాజరుకాకపోవడంపై స్పందించారు. రామమందిర కమిటీ ఆహ్వానాన్ని కాంగ్రెస్ నేతలు తిరస్కరించారని గుర్తుచేశారు. హనుమాన్ చాలీసా వింటున్న ప్రజలను వారి అనుచరులు, సహాయకులు సులభంగా కొట్టవచ్చని.. అందుకే రామమందిర ఆహ్వానాన్ని స్వీకరించలేదని మండిపడ్డారు.

ప్రధాన ప్రతిపక్ష పార్టీ మైనారిటీలను మభ్యపెడుతోందని పునరుద్ఘాటించిన ప్రధాని మోడీ.. సంపదనంతా చొరబాటు దారులకు పంచిపెడతారని అన్న వ్యాఖ్యలను మరోసారి ప్రస్తావించారు. ఇటీవలే రాజస్థాన్‌ వచ్చినప్పుడు తన 90 సెకన్ల ప్రసంగంలో కొన్ని నిజాలను దేశప్రజల ముందుంచా అని అన్నారు మోడీ. తన ప్రసంగానికి కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలో భయాందోళనలు సృష్టించాయని తెలిపారు. ప్రజల సంపల లాక్కొని వాటిని చొరబాటుదారులకు పంపిణీ చేసే కుట్ర పన్నుతోందని తెలిపారన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలను బయటపెట్టానని స్పష్టం చేశారు. నిజాలు చెప్తే కాంగ్రెస్ ఎందుకు అంత భయపడుతోంది? అని అడిగారు మోడీ.

ప్రధాని ప్రసంగంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. ఇరువర్గాలను రెచ్చగొట్టేలా ప్రధాని వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. గ్రూపులమధ్య శత్రుత్వాన్ని సృష్టించే లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. ఒక ప్రధానమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.



Next Story

Most Viewed