కేజ్రీవాల్‌కు ఎల్‌జీ గవర్నర్ బహిరంగ లేఖ

by Dishanational1 |
కేజ్రీవాల్‌కు ఎల్‌జీ గవర్నర్ బహిరంగ లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జైల్లో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బహిరంగ లేఖ రాశారు. ఇటీవల ఈశాన్య ఢిల్లీలోని ఫార్ష్ బజార్ ప్రాంతంలో సాధారణ కుళాయి నుంచి నీటిని పట్టుకునే విషయంలో పొరుగువారితో గొడవపడి ఓ మహిళ హత్యకు గురైంది. దీనికి సంబంధించి ఢిల్లీ జల్ బోర్డు సీఈఓను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆప్ మంత్రి అతిషి లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఈ బహిరంగ లేఖ రాశారు. ఢిల్లీ నీటి సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన సక్సేనా..' మీ మంత్రులు వారి స్వంత తప్పిదానికి అధికారులను నిందించడం అలవాటుగా మారింది' అని గవర్నర్ లేఖలో అన్నారు. దేశ రాజధానిలోని పేదలు నివశించే ప్రాంతాల్లో నీటి కొరత గురించి ధ్వజమెత్తారు. ఈ పరిస్థితి 'గత దశాబ్దంలో ఇది తీవ్రమైంది' అని పేర్కొన్నారు. ఆప్ మంత్రి అతిషి ఒక విషాద సంఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని ఆరోపించారు. ఉచిత నీటిని భూతంగా చూపిస్తూ ఆప్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, అన్యాయమైన నీటి సరఫరాను చక్కదిద్దడానికి బదులుగా ఇబ్బందులు సృష్టించారు. మీకు, మీ మంత్రికి ప్రజలను మోసం చేయడం పరిపాటిగా మారిందన్నారు. దేశ రాజధానిలో నీటి సంక్షోభాన్ని వివరిస్తూ, నగరంలో దాదాపు 2 కోట్ల మంది(80 శాతం) ప్రజలు వివిధ స్థాయిలలో తాగునీటి సరఫరాను కోల్పోయారని చెప్పారు. అలాగే, మంత్రి అతిషి ఢిల్లీ జల్ బోర్డు నిధులను ఆపడానికి కుట్ర జరిగిందన్న ఆరోపణలపై స్పందించిన సక్సేనా. 2015 నుంచి ఢిల్లీ జల్ బోర్డు ద్వారా రూ. 28,400 కోట్ల మూలధన వ్యయం ఖర్చు అయ్యిందన్నారు.


Next Story

Most Viewed